ఐపీఎల్ 2026 పాయింట్ల పట్టికలో ఏ జట్టు ఎక్కడుందంటే..?

  • ఓటమి అన్నది లేకుండా టాప్ లో పంజాబ్ కింగ్స్
  • నాలుగు విజయాలు, మెరుగైన రన్‌రేట్‌తో రెండో స్థానంలో ఆర్సీబీ
  • ఒక్క విజయం కూడా లేకుండా అట్టడుగున కోల్‌కతా నైట్‌రైడర్స్
  • ప్లేఆఫ్స్ రేసు కోసం తీవ్రంగా శ్రమిస్తున్న సన్‌రైజర్స్, చెన్నై
ఐపీఎల్ 2026 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. లీగ్ దశలో దాదాపు సగం మ్యాచ్‌లు పూర్తికావస్తున్న తరుణంలో ప్లేఆఫ్స్ రేసు ఆసక్తికరంగా మారింది. శుక్రవారం నాటి మ్యాచ్ ల తర్వాత.. అనూహ్యంగా పంజాబ్ కింగ్స్ ఆడిన 5 మ్యాచ్‌లలో ఓటమి అన్నది లేకుండా 9 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), రాజస్థాన్ రాయల్స్ చెరో 8 పాయింట్లతో గట్టిపోటీనిస్తున్నాయి.

ప్రస్తుత పాయింట్ల పట్టిక ప్రకారం, పంజాబ్ కింగ్స్ 4 విజయాలు, ఒక ఫలితం తేలని మ్యాచ్‌తో అజేయంగా కొనసాగుతోంది. ఇక ఆర్సీబీ కూడా 4 విజయాలతో పటిష్ఠంగా కనిపిస్తున్నా, వారి నెట్ రన్‌రేట్ (+1.503) అత్యుత్తమంగా ఉండటంతో రెండో స్థానంలో నిలిచింది. రాజస్థాన్ రాయల్స్ కూడా 4 విజయాలతో 8 పాయింట్లు సాధించి మూడో స్థానంలో రేసులో ఉంది.

మరోవైపు, ఈ సీజన్‌లో కొన్ని పెద్ద జట్లు తీవ్రంగా నిరాశపరిచాయి. కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆడిన 6 మ్యాచ్‌లలో ఒక్క విజయం కూడా సాధించలేక కేవలం ఒక పాయింట్‌తో (రద్దైన మ్యాచ్ కారణంగా) పట్టికలో అట్టడుగున నిలిచింది. ఐదుసార్లు ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ సైతం 5 మ్యాచ్‌లలో ఒకే ఒక్క విజయంతో తొమ్మిదో స్థానంలో ఉంది.

ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ నాలుగో స్థానంలో ఉండగా, సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ వంటి జట్లు ప్లేఆఫ్స్ స్థానం కోసం తీవ్రంగా పోటీ పడుతున్నాయి. రాబోయే మ్యాచ్‌ల ఫలితాలు పాయింట్ల పట్టికలో మరిన్ని మార్పులకు దారితీయనున్నాయి.

IPL 2026
Punjab Kings
RCB
Rajasthan Royals
Kolkata Knight Riders
Mumbai Indians
Gujarat Titans
Sunrisers Hyderabad
Chennai Super Kings
Delhi Capitals

More Telugu News